చెప్పదప్పదాయె

 *ఓంశ్రీవిఘ్నేశ్వరాయనమః*

*చెప్పదప్పదాయె చేదునిజము*

శతకం ప్రారంభం

*బలిజేపల్లి ద్వారకనాథ్ విరచితం*


ఆ.వె

మొదలు పెట్టుచుంటి మోదక ప్రియ నేడు

శతకమొకటి సంతసమును బంచ

నిజములెన్నొ కలవు నిర్విఘ్నముగ వాటి

చెప్ప నిమ్ము తండ్రి శివకుమార


1.

మనసు మ్రగ్గవలయు మాట తగ్గవలయు

నణగవలయు శత్రు గుణము లారు

తానె యోగి యపుడు  తపములు సేయకే

చెప్పదప్పదాయె చేదు నిజము

Comments

Popular posts from this blog

చెప్పదప్పదాయె